భారత మాజీ క్రికెటర్ హఠాన్మరణం

భారత మాజీ క్రికెటర్, తమిళనాడు ఓపెనర్ వీ.బీ చంద్రశేఖర్ గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. వీబీ అని క్రికెట్ సర్కిల్‌లో పేరు పొందిన చంద్రశేఖర్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. టీం ఇండియా తరఫున కేవలం ఏడు మ్యాచులు మాత్రమే ఆడిన చంద్రశేఖర్..53 పరుగులు చేశారు. అయితే జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచులు ఆడకపోయినా.. తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాక.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌కు చెందిన […]

భారత మాజీ క్రికెటర్ హఠాన్మరణం
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2019 | 12:04 AM

భారత మాజీ క్రికెటర్, తమిళనాడు ఓపెనర్ వీ.బీ చంద్రశేఖర్ గురువారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. వీబీ అని క్రికెట్ సర్కిల్‌లో పేరు పొందిన చంద్రశేఖర్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. టీం ఇండియా తరఫున కేవలం ఏడు మ్యాచులు మాత్రమే ఆడిన చంద్రశేఖర్..53 పరుగులు చేశారు. అయితే జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచులు ఆడకపోయినా.. తమిళనాడు తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాక.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌కు చెందిన కాంచీ వీరన్స్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మొదటి మూడేళ్లు మేనేజర్‌గా ఉన్నారు.

వీబీ మృతిపై టీం ఇండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. ‘‘ఇది నాకు నిజంగా షాక్‌. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను. అతను అద్భుతమైన దూకుడుగల బ్యాట్స్‌మెన్. టీం ఇండియా తరఫున అతను ఎక్కువ మ్యాచులు ఆడలేకపోవడం చాలా దురదృష్టకరం. మేం ఇద్దరం కలిసి చాలాసార్లు కామెంట్రీ కూడా చేశామంటూ గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్‌తో పాటు సురైష్ రైనా, హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా వీబీ మృతికి సంతాపం తెలిపారు. అటు బీసీసీఐ కూడా ట్విట్టర్ ద్వారా వీబీ మృతికి సంతాపం తెలియజేసింది.