ఈ కాషాయ కిరణాలు

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపిన బీజేపీ పెద్ద తలకాయలకోసం స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ ని కమలం గూటికి రప్పిస్తాం.. కాషాయ కండువా కప్పేస్తాం అంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు మా నాయకుడు కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదంటున్నారు హస్తం నేతలు. అయితే నల్లారి మాత్రం ఈ ప్రచారాలపై నోరు మెదపడం లేదు. మరోవైపు కిరణ్ కుమార్ కమలం చెంతకు చేరితే ఏపీలో బీజేపీకి […]

ఈ కాషాయ కిరణాలు
Follow us

|

Updated on: Jul 23, 2019 | 7:52 PM

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కి తెర లేపిన బీజేపీ పెద్ద తలకాయలకోసం స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ ని కమలం గూటికి రప్పిస్తాం.. కాషాయ కండువా కప్పేస్తాం అంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోవైపు మా నాయకుడు కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదంటున్నారు హస్తం నేతలు. అయితే నల్లారి మాత్రం ఈ ప్రచారాలపై నోరు మెదపడం లేదు.

మరోవైపు కిరణ్ కుమార్ కమలం చెంతకు చేరితే ఏపీలో బీజేపీకి సీఎం అభ్యర్ధి దొరికినట్టే అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆ మధ్య జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి, డిపాజిట్లు కూడా దక్కక మళ్లీ హస్తం గూటికే చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడకపోవడంతో.. ఆయన ఉన్నా.. లేకపోయినా ఒక్కటే అన్న ప్రచారమూ సాగుతోంది.

కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరినప్పటినుంచి ఇద్దరిమధ్య బాగా గ్యాప్ పెరిగిపోయింది. టీడీపీ భవితవ్యం క్షీణిస్తుండటంతో అన్నదమ్ములిద్దరినీ బీజేపీలో చేర్చుకుంటే సోదరులిద్దరూ ఒక్కటవ్వడమే కాకుండా.. వారి రాజకీయ భవిష్యత్ బావుంటుందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే బీజేపీ వ్యూహం కూడా ఫలిస్తుంది.. మాజీ సీఎంకి అదే స్థాయి గౌరవం దక్కుతుందని రాజకీయ వర్గాల భోగట్టా.