బాబు అమెరికా వెళ్లినా.. దృష్టి మాత్రం మాపైనే: వైసీపీ ఎద్దేవా..!

Former CM Chandrababu React to YCP Statements of YCP Leaders, బాబు అమెరికా వెళ్లినా.. దృష్టి మాత్రం మాపైనే: వైసీపీ ఎద్దేవా..!

ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. చికిత్స నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్టు సమాచారం. ఆగష్టు 1న ఆయన మళ్లీ భారత్ చేరుకుంటారు. కాగా.. చంద్రబాబు వైసీపీ నాయకులకు ట్విట్టర్ ద్వారానే కౌంటర్ ఇస్తున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై.. చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. అయితే.. ఈ ట్వీట్లపై సెటైర్లు వేసిన వైసీపీ నేతలు.. బాబు అమెరికా వెళ్లినా.. కాన్సన్‌ట్రేషన్ మాత్రం వైసీపీ ప్రభుత్వంపైనే ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

తాజాగా.. చంద్రబాబు.. ‘తెలుగుదేశం హయాంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన అభివృద్ధి అబద్ధమని రాష్ట్ర శాసనసభలో వైసీపీ నేతలు అడ్డంగా వాదించారు. నోరుందికదా అని అబద్ధాలను మాట్లాడినంత మాత్రాన వాస్తవాలను దాచేయలేరుకదా. రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మంత్రిగారు జులై 26, 2019న చెప్పిన విషయాలివి’.

‘2017-18 సంవత్సరానికి ఏపీ సాధించిన వ్యవసాయ వృద్ధిరేటు అంతకు ముందు ఏడాది కన్నా 17.25 శాతం ఎక్కువ. అంతేకాదు 2016-17లో అంతకు ముందు ఏడాది కన్నా 14.71 శాతం ఎక్కువ, 2015-16లో అంతకు ముందు ఏడాది కన్నా 08.31 శాతం ఎక్కువ వృద్ధిరేట్లను నమోదు చేసాం’. అంటూ ట్వీట్ చేశారు. దీనిపైన.. వైసీపీ నేతలు వ్యంగ్యంగా స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *