బుగ్గన లెక్క తప్పు : యనమల

ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ మండిపడుతోంది. ఆపార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల మాట్లాడుతూ గత ప్రభుత్వం హయంలో అప్పులు పెరిగిపోయినట్టుగా చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ స్థూల ఉత్పత్తి 12శాతం పెరిగిందని, అంతకుముందు తలసరి ఆదాయం రూ.93 వేలు ఉంటే అది తమ ప్రభుత్వంలో రూ. 1.64 లక్షలకు పెరిగిందని చెప్పారు యనమల. టీడీపీ హయాంలో ఆర్ధిక వృద్ధి రేటు మందగించి అప్పులు పెరిగిపోయాయని […]

బుగ్గన లెక్క తప్పు  : యనమల
Follow us

| Edited By:

Updated on: Jul 10, 2019 | 9:11 PM

ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ మండిపడుతోంది. ఆపార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యనమల మాట్లాడుతూ గత ప్రభుత్వం హయంలో అప్పులు పెరిగిపోయినట్టుగా చెప్పడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ స్థూల ఉత్పత్తి 12శాతం పెరిగిందని, అంతకుముందు తలసరి ఆదాయం రూ.93 వేలు ఉంటే అది తమ ప్రభుత్వంలో రూ. 1.64 లక్షలకు పెరిగిందని చెప్పారు యనమల.

టీడీపీ హయాంలో ఆర్ధిక వృద్ధి రేటు మందగించి అప్పులు పెరిగిపోయాయని చెప్పడంపై యనమల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయరంగంలో 11 శాతం వృద్ధిరేటు సాధించామని, విభజన తర్వాత రాష్ట్రం ఎన్ని ఇబ్బందులకు గురైనప్పటికీ మెరుగైన పాలన అందించామని ఆయన చెప్పారు.

టీడీపీ ప్రభుత్వం హాయంలో తీసుకున్న నిర్ణయాలు, ఒప్పందాలను సమీక్షిస్తూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం.. శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్ధికమంత్రి బుగ్గన బుధవారం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.