Breaking News
  • అమరావతి: చంద్రబాబు నివాసంలో సీనియర్‌ నేతల అత్యవసర భేటీ. టీవీ9 బిగ్ డిబేట్‌లో వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై చర్చ. ముఖ్య నేతలు పార్టీ వీడతారనే ప్రచారంపై పార్టీలో కలకలం. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • మహారాష్ట్రలో మారుతున్న రాజకీయ పరిణామాలు. రాష్ట్రపతి పాలనకు తెరపడే అవకాశం. శివసేన, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన సయోధ్య. శివసేనకు పూర్తికాలం సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అంగీకారం. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎంతో పాటు 50 శాతం మంత్రి పదవులు. కాసేపట్లో సోనియా, పవార్‌ కీలక భేటీ.
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. అనంతరం టీడీపీ ఎంపీలతో భేటీకానున్న చంద్రబాబు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
  • అమరావతి: మంగళగిరిలోని చిల్లపల్లి కల్యాణమండపం చేరుకున్న పవన్‌. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం. తక్షణమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి-పవన్‌ కల్యాణ్‌.
  • గుంటూరు: రొంపిచెర్ల (మం) రామిరెడ్డిపాలెం సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం. ఓ కేసులో ఊరు విడిచి వెళ్లిన సర్పంచ్‌ కోటిరెడ్డి. పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం. నర్సరావుపేట ఆస్పత్రికి తరలింపు.
  • తిరుపతి: చంద్రగిరి లక్ష్మీపురం చెరువు దగ్గర టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు. 45 ఎర్రచందనం దుంగలు స్వాధీనం. తమిళనాడుకు చెందిన ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్‌.
  • సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీష్‌రావు పర్యటన. ఆందోల్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధికార్యక్రమాలు. సింగూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న హరీష్‌రావు. మంత్రి హరీష్‌రావుతో పాటు పాల్గొననున్న ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌.

ప్రజలకోసం పోరాడితే కేసులా? ఏపీ ప్రభుత్వంపై బాబు ఆగ్రహం

former AP CM Chandrababu fire on YCP Government

ఏపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కర్నూలు జిల్లా కోడుమూరులో విష్ణువర్ధన్ అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో 150 మంది దళిత కుటుంబాలు నెలల తరబడి గ్రామ బహిష్కరణకు గురైనా చర్యలు తీసుకోని అధికారులు ఇప్పుడు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ చట్టం పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ కార్యకర్తలు, నేతలపై లేనిపోని కేసులు పెట్టి వేధింపులకు దిగుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై అక్రమంగా 19 కేసులు పెట్టి వేధించి.. చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల వేధింపులకు అంతు లేకుండా పోయిందని చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.