కేరళ సచివాలయం అగ్నిప్రమాదం కేసు దర్యాప్తు తూ తూ మంత్రమేనా?

కేరళ సెక్రటేరియట్‌ భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం చూశాం! ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదయ్యాయని అధికారులు చెప్పడంతోనే రాద్ధాంతం మొదలయ్యింది..

కేరళ సచివాలయం అగ్నిప్రమాదం కేసు దర్యాప్తు తూ తూ మంత్రమేనా?
Follow us

|

Updated on: Aug 28, 2020 | 3:13 PM

కేరళ సెక్రటేరియట్‌ భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఈ ఘటనపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం చూశాం! ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదయ్యాయని అధికారులు చెప్పడంతోనే రాద్ధాంతం మొదలయ్యింది.. అక్రమ బంగారం రవాణా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేయడానికే ప్రభుత్వం ఈ అగ్ని ప్రమాదం డ్రామాకు తెర తీసిందన్నది విపక్షాల ప్రధాన ఆరోపణ.. అయితే గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను డిజిటలైజేషన్‌ చేశామని, విపక్షాల విమర్శల్లో పస లేదని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేయడంతో ప్రస్తుతానికి ఈ గొడవ సద్దుమణిగింది.. వివాదం ఇప్పుడు సద్దుమణగవచ్చుకానీ, అగ్ని ప్రమాదానికి కారణాలేమిటన్న సంగతి వెలుగులోకి వస్తుందా? లేక దర్యాప్తు ఇక్కడితోనే ఆగిపోతుందా అన్న అనుమానాలు చాలా మందికి కలుగుతున్నాయి.. కారణం రెండేళ్ల క్రితం స్వామి సందీపానంద గిరి ఆశ్రమంలో జరిగిన దాడి ఘటన స్మృతిలో మెదలడమే! ఆ దాడికి పాల్పడిన వారిని ఇప్పటివరకు పోలీసులు పసిగట్టలేకపోవడమే..! అక్టోబర్‌ 27, 2018న జరిగిన ఆ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతీ లేదు.. అసలు పోలీసులు ఆ కేసును క్లోజ్‌ చేశారేమో కూడా తెలియదు.

శబరిమల ఆలయంలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు దరిమలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి, సందీపానందగిరి ఆశ్రమంపై దాడి జరగడానికి సంబంధం ఉందా అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు జరిపారు కానీ.. ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయారు.. తిరువనంతపురంలోని కుందమాన్‌కడవులో భగవద్గీత స్కూల్‌ డైరెక్టర్‌ స్వామి సందీపానంద గిరి ఆశ్రమం ఉంది.. ఆ ఆశ్రమంపైనే అప్పట్లో దాడి జరిగింది.. ఆశ్రమానికి చెందిన రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు.. శబరిమలలో మహిళల ప్రవేశానికి సందీపానందగిరి మద్దతు ఇవ్వడం కొందరికి కోపం తెప్పించింది.. దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి పినరయ్‌ విజయ్‌ ఘటన స్థలిని సందర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మాటిచ్చారు. సంఘ్‌ పరివార్‌కు చెందిన వారే ఈ దాడికి పాల్పడ్డారన్నది చాలా మంది నమ్మకం . పోలీసులు ఆ దిశగా దర్యాప్తే చేయలేదు.

పాపం సందీపానంద గిరి కూడా తన ఆశ్రమంపై దాడి చేసింది రైట్‌ వింగ్‌ మద్దతుదారులేనని నెత్తినోరు మొత్తుకున్నారు.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పినా స్థానిక పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కేసును ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారు. దర్యాప్తు నత్తనడకన నడుస్తున్నదంటూ సందీపానందగిరి ముఖ్యమంత్రితో మొరపెట్టుకోవడంతో నిరుడు కేసును క్రైమ్‌ బ్రాంచ్‌కు తరలించారు. అంతే.. అక్కడా కేసు ముందుకు సాగలేదు.. మొదట్లో నగర పోలీసు కమిషనర్‌ పి. ప్రకాశ్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగింది.. ఇప్పుడు క్రైమ్‌ బ్రాంచ్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ టి. జయకుమార్‌ కేసును పరిశీలిస్తున్నారు.. ఇప్పటి వరకు కేసులో చిన్నపాటి క్లూ కూడా దొరకలేదని పోలీసు వర్గాలు అంటున్నాయి.. దర్యాప్తులో భాగంగా చాలా మంది స్టేట్‌మెంట్లను తీసుకున్నామని చెబుతున్నారే తప్ప ఎవరేం చెప్పారన్నది పోలీసులు బయటపెట్టడం లేదు. కిందటి నెలనే కేసు తన చేతికి వచ్చిందని, త్వరలో నిందితులను పట్టుకుంటామని జయకుమార్‌ చెబుతున్నారు.

కోవిడ్‌-19 కారణంగా దర్యాప్తులో కాస్త ఆలస్యం జరుగుతుందన్నారు. మరోవైపు సందీపానంద గిరి మాత్రం కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ పథకం ప్రకారం సంఘ్‌ పరివార్‌ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయం అందరికీ తెలుసని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ లేకపోవడంతో నిందితులు తప్పించుకుంటున్నారని సందీపానందగిరి అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై, శబరిమల తంత్రితో పాటు పాండలం రాజ కుటుంబమే ఈ దాడికి కారణమంటూ సందీపానంద అప్పట్లో ఆరోపించారు కూడా! బీజేపీ మాత్రం ఈ దాడి ఘటన పలు అనుమానాలకు తావిస్తోందని అంటోంది.. శబరిమల వివాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగమిదని ఆరోపిస్తోంది.. తమ ప్రతిష్టను దిగజార్చడం కోసం సందీపానందగిరి అల్లిన ప్రణాళిక అని విమర్శిస్తోంది.. ఒకవేళ సాక్షాధారాలు ఉంటే ఇంతకాలం ఎందుకు గమ్మున ఉన్నట్టు అని ప్రశ్నిస్తోంది.. దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని, అప్పుడు దోషులెవరో బయటకు వస్తుందని సవాల్‌ విసురుతోంది..

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!