ఐసీయూలో బోరిస్.. ఇక బ్రిటన్‌ పగ్గాలు ఎవరి చేతిలోకి వచ్చాయో తెలుసా..?

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేస్తోంది. దీని ధాటికి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆస్పత్రిపాలై.. ప్రాణాలతో పోరుడాతున్నారు. తాజాగా.. ఈ మహమ్మారి సోకి.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సస్ కూడా ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆయన్ను ఐసోలేషన్‌ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు అక్కడి వైద్యులు. అయితే పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారడంతో.. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూకి తరలించారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని నడిపేది ఎవరన్న దానిపై […]

ఐసీయూలో బోరిస్.. ఇక బ్రిటన్‌ పగ్గాలు ఎవరి చేతిలోకి వచ్చాయో తెలుసా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 7:28 PM

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేస్తోంది. దీని ధాటికి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆస్పత్రిపాలై.. ప్రాణాలతో పోరుడాతున్నారు. తాజాగా.. ఈ మహమ్మారి సోకి.. బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సస్ కూడా ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఆయన్ను ఐసోలేషన్‌ వార్డులో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు అక్కడి వైద్యులు. అయితే పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారడంతో.. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూకి తరలించారు. దీంతో బ్రిటన్ ప్రభుత్వాన్ని నడిపేది ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. బ్రిటన్ ప్రభుత్వ పగ్గాలు.. ఫారిన్ సెక్రెటరీ డోమినిక్ రాబ్‌కు అప్పగించింది బ్రిటన్‌ కేబినెట్. ఈ విషయంపై క్యాబినెట్ కార్యాలయం మంత్రి మైఖేల్ గోవ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రధాని బోరిస్ జాన్సన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. అయినప్పటకీ.. ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలలో ఎటువంటి ఆలస్యం జరగదన్నారు.

ప్రస్తుతం బ్రిటన్‌లో అమలవుతున్న లాక్‌డౌన్‌పై.. సోమవారం రివ్యూ జరుగుతుందని.. దీనిపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం.. ఫారిన్‌ సెక్రటరీ “డోమినిక్ రాబ్‌”దేనని.. గోవ్ తెలిపారు.