‘ బహెన్ జీ….. ‘ డియర్ సిస్టర్ ‘…. సుష్మకు ప్రపంచ నేతల నివాళి

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి ప్రపంచ వ్యాప్తంగా నేతలు నివాళులర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్, బహరైన్ విదేశ వ్యవహారాల మంత్రి ఖాలిద్ బిన్ అహ్మద్ ఖలీఫా, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఆ దేశ విదేశాంగ మంత్రి సలావుద్దీన్ రబ్బానీ, ఇంకా ఇండియాలోని రష్యా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ రాయబారులు సంతాప సందేశాలు పంపారు. హమీద్ కర్జాయ్, ఖాలిద్ బిన్ అహ్మద్ తమ సందేశాల్లో సుష్మా […]

' బహెన్ జీ..... ' డియర్ సిస్టర్ '.... సుష్మకు ప్రపంచ నేతల నివాళి
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 4:45 PM

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతికి ప్రపంచ వ్యాప్తంగా నేతలు నివాళులర్పించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్, బహరైన్ విదేశ వ్యవహారాల మంత్రి ఖాలిద్ బిన్ అహ్మద్ ఖలీఫా, ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఆ దేశ విదేశాంగ మంత్రి సలావుద్దీన్ రబ్బానీ, ఇంకా ఇండియాలోని రష్యా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ రాయబారులు సంతాప సందేశాలు పంపారు. హమీద్ కర్జాయ్, ఖాలిద్ బిన్ అహ్మద్ తమ సందేశాల్లో సుష్మా స్వరాజ్ ను ‘ డియర్ సిస్టర్ ‘, ‘ బహెన్ జీ ‘ అంటూ సంబోధించి ఆమె పట్ల తమ అత్యంత అభిమానాన్ని చాటుకున్నారు. సుష్మ అసాధారణ వ్యక్తిత్వం గల మహిళ అని, ఆమె మృతితో తమ దేశం మంచి స్నేహితురాలిని కోల్పోయిందని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. భారత-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను ఉన్నత స్థాయికి చేర్చడంలో సుష్మ కృషి మరువలేనిదన్నారు. ఇక-సుష్మాతో ఒకప్పుడు తాను జరిపిన ఫలవంతమైన చర్చలను ఇరాన్ విదేశాంగ మంత్రి జావేద్ జరీఫ్ గుర్తు చేసుకుని ట్వీట్లు చేశారు. తనను ఆమె ఎప్పుడూ ‘ డియర్ బ్రదర్ ‘ అని ఆప్యాయంగా పిలిచేవారని బహరైన్ విదేశాంగ మంత్రి ఖాలిద్ బిన్ పేర్కొన్నారు. ‘ రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ సిస్టర్, ఇండియా అండ్ బహరైన్ విల్ మిస్ యు ‘ అని ఆయన ట్వీట్ చేశారు. ఇండియాలోని ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా స్వయంగా సుష్మ స్వరాజ్ నివాసానికి వెళ్లి ఆమె భౌతిక కాయానికి శ్రధ్ధాంజలి ఘటించారు.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో