‘కొమరం భీం’ జోడీ ఈవిడేనట !

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR మూవీకి సంబంధించి ఒక మేజర్ అప్ డేట్ ను మూవీ టీం విడుదల చేసింది. తారక్ సరసన ఫారన్ బ్యూటీ ఒలీవియా నటించనున్నట్టు మూవీ టీం తెలియజేసింది. ఒలీవియా మంచి ధియేటర్ ఆర్టిస్ట్ , అన్ని రకాల హావభావాలు, ఎమోషన్స్ ని బాగా పండించగలదు. పైగా, ఈ మూవీలో ఎన్టీయార్ ప్రేయసి పాత్రకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఒలివీయాలో ఉండటంతో ఈ రోల్ కి ఈ […]

'కొమరం భీం' జోడీ ఈవిడేనట !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 20, 2019 | 6:26 PM

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR మూవీకి సంబంధించి ఒక మేజర్ అప్ డేట్ ను మూవీ టీం విడుదల చేసింది. తారక్ సరసన ఫారన్ బ్యూటీ ఒలీవియా నటించనున్నట్టు మూవీ టీం తెలియజేసింది. ఒలీవియా మంచి ధియేటర్ ఆర్టిస్ట్ , అన్ని రకాల హావభావాలు, ఎమోషన్స్ ని బాగా పండించగలదు. పైగా, ఈ మూవీలో ఎన్టీయార్ ప్రేయసి పాత్రకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఒలివీయాలో ఉండటంతో ఈ రోల్ కి ఈ బ్యూటీయే కన్ఫామ్ అయినట్టు చెబుతున్నారు.అంతేకాదు ఐరిష్ నటి అలీసన్ డూడీ నెగటివ్ రోల్లో కనిపిస్తుండగా, రేమండ్ స్టీవెన్సన్ ని కూడా ఓ ముఖ్యమైన పాత్రకోసం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటి అలియభట్ నటిస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఎడ్గార్ జోన్స్ ని అనుకున్నప్పటికి కొన్ని కారణాల వల్ల ఆమె సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎవరిని తీసుకున్నారు అన్న విషయానిపై ఈ రోజుతో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.