వారిని బలిపశువులను చేశారు: హైకోర్టు

తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను ముంబయి హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది.

వారిని బలిపశువులను చేశారు: హైకోర్టు
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 8:26 AM

Bombay high court: తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన 29 మంది విదేశీయులపై నమోదైన కేసులను ముంబయి హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది. మార్చిలో ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిని బలి పశువులను చేశారని, కరోనా వ్యాప్తికి వారు కారణమంటూ అనవసర ప్రచారాలు చేశారని హైకోర్టు పేర్కొంది. ఇక ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు మానవత్వం లేకుండా వ్యవహరించారని న్యాయస్థానం తెలిపింది. రాజకీయ బలవంతంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరించిందని ధర్మాసనం వెల్లడించింది. వీరిపై తప్పుగా ప్రచారం చేసినందుకు గానూ సోషల్ మీడియాపైనా ముంబయి హైకోర్టు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరుకావడం వలనే దేశంలో కరోనా వ్యాప్తికి కారణమైనట్లు అప్పట్లో పెద్ద ఎత్తున్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పర్యాటక వీసా అనుమతులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న 29 మంది విదేశీ పౌరులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. 50 సంవత్సరాలుగా తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం జరుగుతుందని, ఇది ఏడాదంతా సాగుతుందని వ్యాఖ్యానించింది. అతిథులను స్వాగతించే గొప్ప సంప్రదాయం, సంస్కృతిని భారతదేశ ప్రజలు నిజంగా పాటిస్తున్నారా..? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. విదేశీయులపై ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు పశ్చాత్తాపడాలని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపింది.

Read More:

నిబంధనల ఉల్లంఘన.. ఏలూరులో ప్రైవేట్ ఆసుపత్రి సీజ్‌

ఆ ఇద్దరు హీరోల సినిమాలు అయితే నటిస్తా: రోజా

వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌