ఆర్టికల్‌ 370 రద్దు: కశ్మీర్‌లో పర్యటించనున్న అజిత్ దోవల్

Forces on alert: National Security Adviser Ajit Doval, ఆర్టికల్‌ 370 రద్దు: కశ్మీర్‌లో పర్యటించనున్న అజిత్ దోవల్

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం.. ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కశ్మీర్‌లోని పరిస్థితిని సమీక్షించి అవసరమైన అదనపు బలగాలను తరలించారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం హోంమంత్రి అమిత్‌షా, దోవల్‌తో కలిసి రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాలు అక్కడ మోహరించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *