Breaking News
  • కరోనా నుంచి బయటపడిన చైనా, ఇప్పుడు యూరప్‌ దేశాలకు కిట్లను, మాస్క్‌లను పంపిస్తోంది. అయితే వాటిలో నాణ్యత లేదని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. పరికరాలను తిప్పి పంపిస్తున్నాయి. ఈ సంక్షోభాన్ని, చైనా తన ప్రభావాన్ని విస్తరించుకోవడానికి వాడుకుంటోందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భూతం విస్తరిస్తోంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలలో 11 జిల్లాలను కరోనా కమ్మేసింది. నిజాముద్దీన్‌ జమాత్‌ లింకులతో చిన్న పట్టణాలు, పల్లెలకు కూడా వ్యాపించింది కరోనా.. కొత్త కేసులన్నింటికీ ఢిల్లీ లింకులుండటం ఆందోళన కలిగిస్తోంది.
  • కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సాయాన్ని అందించింది. భారత్‌తో పాటు కరోనాను ఎదుర్కొంటున్న పలు దేశాలకు ప్రపంచబ్యాంకు ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. కరోనాను తీవ్రంగా ప్రతిఘటిస్తున్న భారత్‌కు ఒక బిలియన్‌ డాలర్ల భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది ప్రపంచబ్యాంక్‌..
  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇది గందరగోళానికి దారి తీస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు ఆశావర్కర్లు. సర్వే కోసమని వెళ్లిన ఆశా వర్కర్లను దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నించారు
  • అమరావతి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు. 6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ.

మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఎలాగంటే.?

Here Are The Ways To Protect Your Liver While Drinking, మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఎలాగంటే.?

టైటిల్‌ను చూసి షాక్ అవుతున్నారా..? ఎవరైనా మద్యం సేవిస్తే.. ఆరోగ్యం పాడవుతుందని అంటారు. ఇక్కడేంటి కాపాడుకోవచ్చు అని చెబుతున్నానని అనుకుంటున్నారా.? అక్కడికే వస్తున్నానండీ.. ఇప్పుడు మితంగా మనం భోజనం తింటే అంతా బాగుంటుంది. అదే అమితంగా తింటే.. లేని పోనీ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇలా ఏదైనా మితంగా తింటేనే మంచిదని పెద్దలు చెబుతుంటారు. అలాగే మితంగా మద్యం సేవిస్తే.. నష్టాలు కంటే.. లాభాలే ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక మితంగా మద్యం సేవించడంతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

రోజుకి లెక్కలేసుకుని మందు తాగే రోజులు పోయాయి. ఇప్పుడు మందుబాబులు సందు దొరికితే చాలు.. మద్యం షాపుల్లో బాటిళ్లకు బాటిళ్లు తాగేస్తుంటారు. ఎక్కువ మంది చీప్ లిక్కర్ తాగుతుండటంతో లేనిపోని రోగాలు వస్తుంటాయి. అందుకే డాక్టర్లు మితంగా మద్యం సేవిస్తే మంచిదని సలహా ఇస్తుంటారు. ఇక మితంగా రోజుకు ఓ పెగ్ మందు పుచ్చుకునే వాళ్ళు ఎక్కువగా గ్రీన్ టీను అలవాటు చేసుకుంటే మంచిదని వారి అభిప్రాయం.

Here Are The Ways To Protect Your Liver While Drinking, మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఎలాగంటే.?

గ్రీన్ టీలో తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల.. అవి లివర్‌ను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. లివర్‌లో ఉండే  ఫైబ్రోసిస్, సిర్రోసిస్, హేపతెతిస్ లాంటి విష పదార్ధాలను ఈ యాంటీ యాక్సిడెంట్లు నాశనం చేస్తాయి. మరోవైపు మద్యం సేవించే వాళ్లకు ఎప్పుడూ జీర్ణాశయంలో మంట ఉంటుంది. ఇది తగ్గడానికి రోజువారీ ఆహారంగా ఆపిల్‌ను తింటే.. అందులో ఉండే పెక్టిన్ అనే కెమికల్ మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Here Are The Ways To Protect Your Liver While Drinking, మద్యం తాగినా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. ఎలాగంటే.?

అంతేకాకుండా అల్లాన్ని ద్రవం రూపంలో తీసుకోవడం వల్ల అందులో ఉండే అల్లిసిన్, సెలేనియం లివర్‌ను సురక్షితంగా ఉంచుతాయి. ఇకపోతే మందు తాగేవారు సిట్రస్ జాతి ఫలాలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే.. అవి లివర్‌లో పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాలను నాశనం చేయడంలో సహాయపడతాయి. ఇక కూరగాయల్లో క్యారెట్స్, టమాట, పాలకూర, బీట్ రూట్ లాంటివి తీసుకుంటే డీటాక్సిఫికేషన్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి క్రమం తప్పకుండా వీటన్నింటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.

Related Tags