ఆరోగ్య పుష్కరిణి “పుదీనా’

ఎన్నో ఔషధ గుణాలు దాగివున్న ఆరోగ్య పుష్కరిణిగా పుదీనాను చెప్పుకోవచ్చు. సంవత్సరం పొడవునా లభించే పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే.. ఔషధతత్వాలు ఉన్నదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అలర్జీని, ఉబ్బసాన్ని దూరం చేస్తాయి. తరచూ కూర లేదా పచ్చళ్ల రూపంలో పుదీనా ఆకులను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. శ్వాస సంబంధ సమస్యలను పుదీనా దరి చేరనివ్వదు. ఇందులోని విటమిన్‌ సి, డి ఇ, బి, క్యాల్షియం, పాస్ఫరస్‌ మూలకాల వల్ల […]

ఆరోగ్య పుష్కరిణి పుదీనా'
Follow us

|

Updated on: Oct 31, 2019 | 7:38 PM

ఎన్నో ఔషధ గుణాలు దాగివున్న ఆరోగ్య పుష్కరిణిగా పుదీనాను చెప్పుకోవచ్చు. సంవత్సరం పొడవునా లభించే పుదీనా మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే.. ఔషధతత్వాలు ఉన్నదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అలర్జీని, ఉబ్బసాన్ని దూరం చేస్తాయి. తరచూ కూర లేదా పచ్చళ్ల రూపంలో పుదీనా ఆకులను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. శ్వాస సంబంధ సమస్యలను పుదీనా దరి చేరనివ్వదు. ఇందులోని విటమిన్‌ సి, డి ఇ, బి, క్యాల్షియం, పాస్ఫరస్‌ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలు దరిచేరవు. పుదీనా ఆకులతో టీ చేసుకుని, ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరం బరువు తగ్గుతుంది. ప్రత్యేకమైన సువాసన మెదడుని సానుకూలంగా ప్రభా వితం చేసే శక్తి పుదీనా ఆకుల సొంతం. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్ధంగా నడిపించే పోషకాలూ అధికమే. పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నా, జలుబుతో సతమతమవుతున్నా కప్ఫు పుదీనా చాయ్ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో మనకు తెలి యకుండా పెరిగే కణుతులకు అడ్డుకట్ట వేయాలంటే రోజు వారీ ఆహారంలో పుదీనాను గ్రీన్ చట్నీ రూపంలో కానీ, టీగా కానీ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా ఆకులను వాసన చూస్తే ఆ వికారం తగ్గుతుంది. ఆరోగ్యానికే కాకుండా అందానికి పుదీనా ఎంతో మేలు చేస్తుంది. పుదీనా రసాన్ని ఒంటికి రాయటం వలన చర్మంపై మృతకణాలు నిర్మూలించబడతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. మజ్జిగలో పుదీనాను కలుపుకు తాగడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది.