ఇదో కొత్త దందా..స్విగ్గి బాయ్..బీర్ డెలివరీ!

Food Delivery Executive Held for Carrying Beer for Customer in Dry Gujarat, ఇదో కొత్త దందా..స్విగ్గి బాయ్..బీర్ డెలివరీ!

స్విగ్గీ బాయ్‌గా పనిచేస్తే..ఏం మిగులుతుంది అనుకున్నాడో..ఏమో? రాహుల్‌సిన్హ్ మహిదా అనే యువకుడు కొత్త దందాకి తెర లేపాడు. ఓ వైపు స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే.. మరో వైపు నైట్ టైమ్స్‌లో, డ్రై డేస్‌లో బీర్లను కూడా సరఫరా చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కస్టమర్ కోసం బీర్ బాటిల్స్‌ను తీసుకువెళ్తుండగా అతడ్ని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ బీఏ చౌదరి తెలిపారు. లక్ష్మీపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి వద్ద నుంచి 6 బీర్ టిన్స్, సెల్ ఫోన్‌, బైకుతో పాటు రూ.47నగదును స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *