Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

డెలివరీ బాయ్ నిర్వాకం..పుడ్ ఇచ్చి..పెట్ డాగ్‌ని కిడ్నాప్ చేశాడు!

Zomato delivery man walks off with Pune woman's pet dog, డెలివరీ బాయ్ నిర్వాకం..పుడ్ ఇచ్చి..పెట్ డాగ్‌ని కిడ్నాప్ చేశాడు!

ప్రస్తుతం ఇంట్లో ఉంటే చాలు..ప్రతిది ఆన్‌లైన్ డెలివరీ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. దీని వల్ల చాలా టైం సేవ్ అవుతుందన్న విషయం పక్కనపెడితే కొన్ని వింత సంఘటనలు కూడా ఎదురవుతున్నాయి. ఓ కస్టమర్‌కు ఆహారాన్ని డెలవరీ చేసిన జొమాటో డెలవరీ బాయ్.. ఆ ఇంట్లోని పెంపుడు కుక్క పిల్లను ఎత్తుకుపోయాడు. పుణెకు చెందిన వందన షా సోమవారం జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. తుషార్ అనే యువకుడు దాన్ని డెలవరీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆమె పెంపుడు కుక్క ‘దొత్తు’ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికినా కూడా ఫలితం లేకపోయింది. అనంతరం సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన వీడియోను చూడగా.. అందులో కుక్క ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందో కనిపించలేదు.

దీంతో ఆమె ఇరుగుపొరుగు ఇళ్ల వారిని  అడగగా జొమాటో డెలవరీ బాయ్ దాన్ని తీసుకెళ్లడం చూశామన్నారు. దీంతో వందన ట్విట్టర్ ద్వారా జొమాటోకు ఫిర్యాదు చేసింది. తుషార్ అనే డెలవరీ బాయ్ తన పెంపుడు కుక్క పిల్లను ఎత్తుకుపోయాడని తెలిపింది. అనంతరం పోలీస్ స్టేషన్‌‌లో కూడా కేసు పెట్టింది. జొమాటో నుంచి వచ్చిన మెసేజ్‌లో గల తుషార్ ఫోన్ నెంబరుకు కూడా ఆమె కాల్ చేసింది.

అయితే.. తాను కుక్కను తీసుకెళ్లలేదని.. తన వెంట వచ్చిందని.. ముద్దుగా ఉంటే వెంట తీసుకెళ్లినట్లు చెప్పారు. తాము పెంచుకునే కుక్క అని.. దాన్ని తిరిగి ఇవ్వాలని.. కావాలంటే డబ్బులు ఇస్తామని చెప్పినా సదరు డెలివరీ బాయ్‌ను తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. సంబంధం లేని మాటలు చెబుతూ.. ఆ కుక్కను తమ ఊరికి పంపినట్లు చెప్పారు.

దీంతో.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతోఈ ఉదంతం వైరల్ గా మారింది. డెలివరీ బాయ్ పేరు తుషార్ గా తేల్చారు. ఈ అంశంపైజొమాటో కూడా రియాక్ట్ అయ్యింది. డెలివరీ బాయ్ మీద చర్యలు తీసుకుంటామని చెబుతూ.. అతడి కోసం వెతుకుతున్నారు.