మోదీ ధ్యానం చేసిన గుహ అద్దె ఎంతో తెలుసా?

Cave PM Modi meditated in can be rented for Rs 990/day, మోదీ ధ్యానం చేసిన గుహ అద్దె ఎంతో తెలుసా?

ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్‌ వెళ్లినప్పుడు ఒక గుహలో ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ గుహ గురించి జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. వై ఫైతో పాటు ఆహారం, కాలింగ్ బెల్ వంటి పలు ఆధునిక సౌకర్యాలు ఉన్న ఈ గుహ గురించి మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ సలహా మేరకు గత ఏడాది గర్వాల్‌ మండల్‌ వికాస్‌ నిగమ్‌ సంస్థ ఈ గుహలను ఏర్పాటు చేసింది. భక్తుల్లో ధ్యానం పట్ల మక్కువ పెంచే ఉద్దేశంతో ప్రధాని వీటిని నిర్మించమన్నారు. గత ఏడాది నుంచి  ఈ గుహలు అందులో ఉన్నా… జనం నుంచి పెద్దగా ఆసక్తి చూపలేదె. తొలుత ఈ గుహ రోజు అద్దె రూ. 3,000గా ఉండేది. ప్రజలను మరింత ప్రేరేపించేందుకు ఇప్పుడు రోజుకు రూ. 990 వసూలు చేస్తున్నారు. కేదార్‌నాథ్‌ ప్రధాన దేవాలయం నుంచి ఒక కిలో మీటర్‌ దూరంలో వీటిని ఏర్పాటు చేశారు. ప్రధాని ఇక్కడ స్వయంగా ధ్యానం చేయడంతో వీటికి మున్ముందు డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నట్లు జీఎంవీఎన్‌ అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *