తేజస్‌ను నడిపిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్

తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌‌ను పరీక్షించారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధ విమానంను తమిళనాడులోని సూలూరులో టెస్ట్ చేశారు. తేజస్‌ విమానాన్ని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్ భదౌరియా స్వయంగా నడిపారు. దీంతో తేజ‌స్ విమానాలు క‌లిగి ఉన్న రెండ‌వ ఐఏఎఫ్ స్క్వాడ్ర‌న్‌గా సూలూరు ఎయిర్‌బేస్ నిలుస్తోంది. సూలూర్‌లో ఉన్న 45వ స్క్వాడ్రన్‌లో తేజ‌స్‌ను చేర్చారు. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో తేజ‌స్ విమానాల‌ను ఫ్లైయింగ్‌ బుల్లెట్లుగా పిలుస్తారు. ఈ తేజస్‌ విమానం స్వదేశి పరిజ్ఞనంతో తయారు చేయబడింది. […]

తేజస్‌ను నడిపిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్
Follow us

|

Updated on: May 27, 2020 | 5:17 PM

తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌‌ను పరీక్షించారు. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధ విమానంను తమిళనాడులోని సూలూరులో టెస్ట్ చేశారు. తేజస్‌ విమానాన్ని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్ భదౌరియా స్వయంగా నడిపారు. దీంతో తేజ‌స్ విమానాలు క‌లిగి ఉన్న రెండ‌వ ఐఏఎఫ్ స్క్వాడ్ర‌న్‌గా సూలూరు ఎయిర్‌బేస్ నిలుస్తోంది. సూలూర్‌లో ఉన్న 45వ స్క్వాడ్రన్‌లో తేజ‌స్‌ను చేర్చారు. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో తేజ‌స్ విమానాల‌ను ఫ్లైయింగ్‌ బుల్లెట్లుగా పిలుస్తారు. ఈ తేజస్‌ విమానం స్వదేశి పరిజ్ఞనంతో తయారు చేయబడింది. ఇది నాలుగో తరం సూపర్‌ సోనిక్‌ విమానాల్లో చిన్న ది, తెలికపాటిది. తేజాస్ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ తయారు చేసింది. విదేశీ విమానాలతో పోల్చితే వీటి ధర చాలా తక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో వీటికి మంచి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుదని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.