ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పది మంది మృతి

Floods affect 4 lakh in Assam, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పది మంది మృతి

ఉత్తర, ఈశాన్య భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల దాటికి ఇప్పటికే పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అస్సాం, సిక్కిం రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సిక్కిం – డార్జిలింగ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి.

ఇక జార్ఖండ్‌లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. లొతట్టు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఇక అసోంలో వరదల దాటికి దాదాపు 1500కు పైగా గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలతో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ధీమాజీ, కోక్రాఝర్,బిశ్వనాథ్, సోనిట్‌పుర్, డరాంగ్, బక్సా, బర్పేట, నల్బరీ,చైరంగ్, బోంగాయ్‌గావ్,లఖీంపూర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

బ్రహ్మపుత్రా నది పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. అధికారులు, సైనికులు రంగంలోకి దిగి సహయం అందిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *