శ్రీశైలంకు భారీ వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

ఎగువ నుంచి వస్తున్న కృష్ణమ్మ వరద నీటితో శ్రీశైలం నిండుకుండలా మారింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,37,730..

శ్రీశైలంకు భారీ వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు
Follow us

|

Updated on: Sep 22, 2020 | 8:54 PM

Srisailam Reservoir : ఎగువ నుంచి వస్తున్న కృష్ణమ్మ వరద నీటితో శ్రీశైలం నిండుకుండలా మారింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 3,37,730  క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3 లక్షల 05 వేల 486 క్యూసెక్కులు ఉన్నది.

పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరుకున్నది. పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం  212.9198 టీఎంసీలు ఉన్నది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో  విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.