లంకగ్రామాల్లో ఉగ్రరూపం దాల్చిన నదులు

Flood threat to low lying areas in East Godavari

తూర్పుగోదావరి జిల్లాల్లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. శబరి, గోదావరి నదులకు వరద నీరు పోటెత్తింది. చింతూరు వద్ద శబరి వరద నీటి మట్ట 41 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. అటు విలీన మండలాలైన వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో దాదాపు 45 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే ముంపు గ్రామాల్లోకి సహాయక బృందాలు చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి తాలిపేరు, డొంకరాయి జలశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో లోతట్టు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా.. అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట, కాట్రేనికోన, ఐ.పోలవరం, రావులపాలెం, సఖినేటిపల్లి, మామిడికుదురు, తాళ్లరేవు, ముమ్మిడివరం, కె.గంగవరం మండలాల్లో ఇళ్లు, పంటలు పూర్తిగా నీటమునిగాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *