రాహుల్ గాంధీ పంపిన వరద సాయం ఖాళీ షాపులో వృధాగా, ఇదెక్కడి చోద్యం ? మలప్పురంలో నిరసనలు

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ  తన నియోజకవర్గానికి పంపిన వరద సహాయం ముక్కుతూ..మూలుగుతూ ఓ ఖాళీ షాపులో వృధాగా పడిఉంది. మలప్పురం సమీపంలోని నీలంబూర్ లో ఖాళీగా ఉన్న అంగట్లో..

  • Umakanth Rao
  • Publish Date - 9:39 pm, Wed, 25 November 20

కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ  తన నియోజకవర్గానికి పంపిన వరద సహాయం ముక్కుతూ..మూలుగుతూ ఓ ఖాళీ షాపులో వృధాగా పడిఉంది. మలప్పురం సమీపంలోని నీలంబూర్ లో ఖాళీగా ఉన్న అంగట్లో ఆహార పాకెట్లు, బట్టలు, ఇతర సామాగ్రిని చూసి స్థానికులు. ఆ షాపును అద్దెకు తీసుకోవడానికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని ఖండిస్తూ పాలక సీపీఎం కు చెందిన డీ వై ఎఫ్ ఐ యువజన విభాగం వారు నిరసనకు దిగారు. ప్రజలకు ఈ పార్టీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వరద సాయం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని నీలంబూర్ ఎమ్మెల్యే పీవీ అన్వర్ జిల్లా కలెక్టర్ ని కోరారు.  నియోజకవర్గంలోని ఇతర వరద సాయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు నాశనం చేశారని ఆయన అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ ఇలాంటి పనులకు దిగుతోందని ఆయన ఆరోపించారు.