వీడియో సర్వీసుల సేవలో ఫ్లిప్‌కార్ట్‌!

ఆన్‌లైన్‌ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన వినియోగదారులకు వీడియో సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను పూర్తయ్యాయి. ఈ సర్వీసు కావాలనుకుంటే ఆండ్రాయిడ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకొని పొందవచ్చు. అమెజాన్‌ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాగా ఇది కూడా స్ట్రీమింగ్‌ సర్వీసులను అందజేస్తుంది. వినియోగదారుల కోసం ఎంపికచేసిన, వారు కోరిన కంటెంట్‌ను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. వీడియోస్ట్రీమింగ్‌ సర్వీసును ఉపయోగించుకొనేందుకు వినియోగదారులు v6.17 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒక సారి మీ యాప్‌ అప్‌లోడ్‌ అయితే […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:59 am, Mon, 19 August 19

ఆన్‌లైన్‌ మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన వినియోగదారులకు వీడియో సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను పూర్తయ్యాయి. ఈ సర్వీసు కావాలనుకుంటే ఆండ్రాయిడ్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకొని పొందవచ్చు. అమెజాన్‌ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాగా ఇది కూడా స్ట్రీమింగ్‌ సర్వీసులను అందజేస్తుంది. వినియోగదారుల కోసం ఎంపికచేసిన, వారు కోరిన కంటెంట్‌ను అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. వీడియోస్ట్రీమింగ్‌ సర్వీసును ఉపయోగించుకొనేందుకు వినియోగదారులు v6.17 యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒక సారి మీ యాప్‌ అప్‌లోడ్‌ అయితే మీరు ఈ సర్వీసును హ్యామ్‌బర్గర్‌ మెనూలోకి వెళ్లి వాడుకోవచ్చు. ముఖ్యంగా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోని కంటెట్‌ దీనిలో ఉంటుంది.