Breaking News
  • కృష్ణాజిల్లా: గన్నవరంలో విషాదం. చెరువులో దూకి డిగ్రీ విద్యార్థి మురళి ఆత్మహత్య. ఎస్సై నారాయణమ్మ భర్త వేధింపులే కారణమంటూ.. వాయిస్‌ మెసేజ్‌ పెట్టిన మురళి.
  • తూ.గో: మంత్రి విశ్వరూప్‌కు హైకోర్టులో చుక్కెదురు. అమలాపురం ల్యాండ్‌ మార్క్‌ శుభకలశంను కూల్చొద్దని హైకోర్టు స్టే. హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ మున్సిపల్‌ చైర్మన్ యాళ్ల నాగ సతీష్.
  • గుంటూరు: ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉంది-కళా వెంకట్రావ్‌. ఉచిత ఇసుక విధానం ఒక్కటే కొరతను తీరుస్తుంది. నియోజకవర్గాల వారీగా ఇసుక రీచ్‌లు పెట్టి అవినీతికి తెరలేపారు. 50 మంది చనిపోయిన తర్వాత తెచ్చిన పాలసీ దారుణంగా ఉంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకోవాలి. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండాలి-కళా వెంకట్రావ్‌.
  • అనంతపురం: నియోజకవర్గానికో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ-బొత్స. అనంతపురం జిల్లాలో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు. వరదలు తగ్గడంతో ఇసుక అందుబాటులోకి వస్తోంది-మంత్రి బొత్స. మరో మూడు రోజుల్లో ఇసుక కొరతను పూర్తిగా అధిగమిస్తాం-బొత్స. పరస్పర అంగీకారంతోనే సింగపూర్‌తో ఒప్పందం విరమించుకున్నాం. పెట్టుబడులు పెడతామని సింగపూర్‌ మంత్రి చెబుతున్నారు-బొత్స.
  • తూ.గో: రామచంద్రపురం మండలం మాలపాడులో దారుణం. యువతిపై పాలిక రాజు అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారం. యువతిని ఫొటోలు తీసి బెదిరించి పలుసార్లు అఘాయిత్యం. ఏడు నెలల గర్భవతి అయ్యాక గుర్తించిన తల్లిదండ్రులు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు. కేసునమోదు చేసిన రామచంద్రపురం పోలీసులు.
  • ఢిల్లీ: సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • ఆర్టీసీ సమ్మెపై విచారణను ముగించిన హైకోర్టు. హైకోర్టుకు కొన్ని పరిమితులున్నాయి. పరిధిదాటి ముందుకు వెళ్లలేం-హైకోర్టు. సమ్మెపై ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు. సమస్య పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా సమస్య పరిష్కరించాలన్న హైకోర్టు. రూట్స్‌ ప్రైవేటీకరణ పిటిషన్‌, ఆత్మహత్యలపై రేపు విచారణ. కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేయాలని.. ప్రభుత్వం, ఆర్టీసీ కార్పొరేషన్‌కు హైకోర్టు ఆదేశం.

చాక్లెట్లకు షార్టేజీ.. ఇంకేదీ దారి..?

మనం చాలా ఇష్టంగా తినే చాక్లెట్లకు కొరత రావచ్చన్న వార్త.. వీటి ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది. గిఫ్ట్‌ల్లోనో.. ఇతర సెలబ్రేషన్స్‌ వేళల్లోనో.. కేక్స్ మాదిరి చాక్లెట్స్ కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయని తెలిసిన ఓ నిజం. అలాంటిది 2050 నాటికి చాక్లెట్ల ఉత్పత్తి దారుణంగా పడిపోవచ్చునని శాస్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఆ కారణాలేంటో తెలుసుకుందాం..!

చాక్లెట్లు అంటే అందరికీ ఇష్టమే. కానీ వాటినే పిచ్చిగా తినేవాళ్లు మాత్రం యూరోప్, అమెరికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల టన్నుల చాక్లెట్లను ఉత్పత్తి చేస్తే ఈ రెండు దేశాల్లోని ప్రజలే ఏటా 10 లక్షల టన్నుల చాక్లెట్లను తింటున్నారట. ఇక తర్వాత ఎక్కువగా వినియోగిస్తున్న దేశం స్విట్జర్లాండ్. ఇక.. చైనా, భారత్‌లు కూడా చాక్లెట్ల వినియోగంలో రోజురోజుకీ పైకి వెళ్తున్నాయి. 2018 లో భారత్ లో 2 లక్షల 52 వేల టన్నుల చాక్లెట్లను తిన్నారు. అమెరికాలో సగటున ఒక వ్యక్తి 8 కిలోల చాక్లెట్లను తింటుంటే, భారత్‌లో 2 కిలోల వరకు లాగించేస్తున్నారట.

ఏ వస్తువైనా డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీదనే నడుస్తుంది. డిమాండ్‌కు తగినంతగా ఉత్పత్తి చేయలేకపోతే ఆ వస్తువు సంక్షోభం దిశగా వెళ్తున్నట్టే. అలాగే.. చాక్లెట్‌కి మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే 2010తో పోలిస్తే 2019కి డిమాండ్ మూడింతలైంది. అయితే.. దీనికి తగ్గట్టు ఉత్పత్తి చెయ్యలేక సంస్థలన్నీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. చాక్లెట్లను కేవలం రుచి కోసమే కాదు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తింటున్నారని ఒక సర్వేలో తేలింది. ఇవి చర్మంపై ముడతలు రావడం చాలా తక్కువని, వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా రావని భావిస్తున్నారు.

కాగా.. ఘనా, కోకోను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం. ఇప్పుడు ఈ దేశంలో ఉత్పత్తి పడిపోవడంతో చైనా దీనికి అండగా నిలిచి ఒకటిన్నర బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించి కోకో పంటపై దృష్టి పెట్టింది. ఇప్పుడిప్పుడే తేరుకున్న మరికొన్ని దేశాలు తేమ, నీడ అవసరం లేని కోకో పంటను పండించడంపై పరిశోధనలు చేస్తున్నాయి. కోకోను పండించే రైతులకు భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు కూడా అందజేసి ఉత్సాహాన్ని నింపుతున్నారు. భవిష్యత్తులో ముంచుకొచ్చే చాక్లెట్ సంక్షోభం నుంచి తప్పించడానికి కంపెనీలు తీసుకుంటున్న చర్యలు ఏ మాత్రం ఉపయోగపడుతాయన్నదానికి కాలమే సమాధానం చెప్పాలంటున్నారు.