ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

హిమాలయాల్లో కొలువు దీరిన కేదార్‌నాథ్‌ ఆలయం ఇవాళ్టి నుంచి తెరచుకుబోతోంది. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఐదుగురు పండితులు.. పంచముఖి డోలీ యాత్రను నిర్వహించారు. ఆరునెలల పాటు మంచులో కప్పబడి ఉన్న కేదార్‌నాథ్‌ ఆలయాన్ని..

ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం
Follow us

| Edited By:

Updated on: Apr 29, 2020 | 9:55 AM

హిమాలయాల్లో కొలువు దీరిన కేదార్‌నాథ్‌ ఆలయం ఇవాళ్టి నుంచి తెరచుకుబోతోంది. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఐదుగురు పండితులు.. పంచముఖి డోలీ యాత్రను నిర్వహించారు. ఆరునెలల పాటు మంచులో కప్పబడి ఉన్న కేదార్‌నాథ్‌ ఆలయాన్ని బుధవారం తిరిగి తెరవాల్సి ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ కష్టమే అనుకున్నారు. కానీ భారీగా మంచు పేరుకుపోయినా… లెక్క చేయలేదు. ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ కేదార్‌నాథ్‌ ఆలయానికి పంచముఖీ స్వామి పల్లకీ మోస్తూ అయిదుగురు పండితులు వెళ్లారు. పల్లకీలో స్వామి ప్రతిమ ఉండడంతో కాళ్లకు చెప్పులు లేకుండానే వీరు బయలుదేరారు. మంచులో కాళ్లు కూరుకుపోతున్నా.. తమ ప్రయాణాన్ని సాగించారు. 12 వందల ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయం పూర్తిగా మంచుతో కప్పుకుపోతుంది.

ప్రతీ సంవత్సరం మంచుకురిసే చలికాలంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని తెరిచే సమయానికి కరోనా రావడంతో.. మరికొన్నాళ్లు మూసే ఉంచారు. తాజాగా ఏప్రిల్‌ 29 నుంచి ఆలయాన్ని తెరవాలని నిర్ణయించారు. వసంత పంచమి రోజున ఆలయాన్ని ఉదయం 6గంటల 10 నిమిషాలకు తెరవనున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో ఈ పంచముఖి డోలీ యాత్ర ప్రధానమైనది. ఆర్మీలోని కుమావో బెటాలియన్ ఏటా దీన్ని నిర్వహిస్తోంది. ప్రతీఏటా ఈ యాత్రలో వెయ్యి మందికి పైగా భక్తులు పాల్గొంటారు. ఈసారి మాత్రం ఐదుగురే పాల్గొనాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్‌లోని నాలుగు ఆలయాల్లో జరిగే ఛార్‌ధామ్ యాత్రలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. కానీ ఈసారి ఆ సందడి లేకుండానే సాదాసీదాగా తెరుచుకుబోతోంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల్ని తిరిగి తెరవాలనే ఆలోచన చేస్తున్నప్పటికీ.. భక్తులను అనుమతించడం కేంద్రం పరిధిలో ఉంది. ఆలయాలను తెరిచినా… ఇప్పట్లో భక్తులను అనుమతించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

Read More: 

తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ

బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్

భారత్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. 31 వేలకు కరోనా పాజిటివ్ కేసులు