తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇక హ్యాపీ జర్నీ

తెలుగు ప్రజలకు ఇది శుభవార్త. వచ్చే ఐదేళ్లలో కొత్తగా ఐదు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రాల మధ్య దూరాన్ని తక్కించాలనే లక్ష్యంతో నిర్మిస్తోన్న ఈ రహదారుల వల్ల.....

తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇక హ్యాపీ జర్నీ
Follow us

|

Updated on: Aug 26, 2020 | 2:25 PM

తెలుగు ప్రజలకు ఇది శుభవార్త. వచ్చే ఐదేళ్లలో కొత్తగా ఐదు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రాల మధ్య దూరాన్ని తక్కించాలనే లక్ష్యంతో నిర్మిస్తోన్న ఈ రహదారుల వల్ల ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు మార్గం సులభం అవ్వడమేకాకుండా, సమయం ఎంతో ఆదా కానుంది. వీటిని జాతీయ రహదారుల ప్రాధికారసంస్థ (NHAI) 2024-2025 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. వీటి ప్రత్యేకతలేమంటే.. ప్రస్తుతం ఉన్న రహదారితో సంబంధం లేకుండా కొత్తగా మరి ఒకటి నిర్మిస్తారు. మలుపులు లేకుండా రహదారుల నిర్మాణాలుంటాయి. సగటున వంద నుంచి నూట ఇరవై స్పీడులో జర్నీ చేయవచ్చు.

ఇక, ఏయే ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ రాహదారులు రాబోతున్నాయనే విషయానికొస్తే..

1. విశాఖ-రాయ్ పూర్ మధ్య నిర్మించబోతోన్న రహదారి. ఇది విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 100 కిలో మీటర్ల మేర ఉంటుంది.

2. దేవరాపల్లి – ఖమ్మం – సూర్యాపేట మధ్య 72 కిలోమీటర్ల మేర ఉంటుంది.

3. విజయవాడ – నాగ్ పూర్ రహదారిని ఖమ్మం – విజయవాడ మధ్య 91 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు.

4. కడప – రేణిగుంట మధ్య 120 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది.

5. చిత్తూరు – తచ్చూరు(తమిళనాడు) మధ్య రాబోయే ఈ రహదారి చిత్తూరు జిల్లా పరిధిలో 83 కిలోమీటర్ల మేర ఉంటుంది.