ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. సాధారణ పౌరుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఐదుగురు లోకసభ్యులు కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారుల వెల్లడించారు.

ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Sep 13, 2020 | 5:20 PM

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. సాధారణ పౌరుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఐదుగురు లోకసభ్యులు కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారుల వెల్లడించారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశానికి ముందు, లోక్‌సభలో ఐదుగురు సభ్యులు కరోనావైరస్ సోకడం కొంత కలవరాన్ని కలిగిస్తోంది. అయితే వర్షకాల పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉభయ సభల సభ్యులందరూ కోవిడ్ -19 పరీక్ష చేయించుకుని త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టును స‌మ‌ర్పించాలి. ఇందుకు పార్లమెంటరీ సెషన్ ప్రారంభానికి 72 గంటలలోపు ప్రభుత్వం అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి గానీ, ప్రయోగశాలలో గానీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. స‌భ్యులంతా దాదాపుగా ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఫ‌లితాలు రావాల్సి ఉన్నాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఈసారి అఖిల‌ప‌క్ష స‌మావేశాన్ని కూడా ర‌ద్దు చేసింది ప్రభుత్వం. నేరుగా బీఏసీ స‌మావేశం నిర్వ‌హించి స‌భ‌లో చ‌ర్చించాల్సిన అంశాల అజెండాను ఖ‌రారు చేశారు. ఈ సమావేశంలో స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సమస్యలు, సెషన్‌లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల జాబితాపై చర్చించారు.

కరోనావైరస్ సంక్షోభం కారణంగా, వర్షకాల పార్లమెంటు సమావేశానికి అనేక మార్పులు చేశారు. ప్రతిరోజూ నాలుగు గంటల సెషన్లను మాత్రమే నిర్వహించాలని కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను తీసేశారు. జీరో అవ‌ర్‌ను త‌గ్గించేశారు. ప్ర‌తీ రోజు నాలుగు గంట‌ల‌పాటు మాత్ర‌మే స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి.

సామాజిక దూర ప్రమాణాలను నిర్ధారించడానికి, రాజ్యసభ ఛాంబర్, గ్యాలరీలు, లోకసభ ఛాంబర్ సభ్యులను కూర్చునేందుకు ఉపయోగిస్తున్నారు వీరిలో 57 మంది ఛాంబర్‌లో, 51 మంది రాజ్యసభ గ్యాలరీలలో వసతి కల్పిస్తున్నారు. మిగిలిన 136 మంది లోకసభ ఛాంబర్‌లో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు పార్లమెంటు అధికారులు. సభ్యులు మాట్లాడటం చూపించడానికి ఛాంబర్‌లో మరో నాలుగు పెద్ద డిస్ ఫ్లే స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.

బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌గానూ చేసింది ఈ బ్యూటీ
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు