ఒడిశాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఆడుకుంటున్న పిల్లలపై దూసుకొచ్చిన డంపర్ లారీ.. ఐదుగురు చిన్నారుల దుర్మరణం

ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారులపై నుంచి డంపర్ లారీ వెళ్లడంతో ఐదుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:56 pm, Tue, 24 November 20

ఒడిశా రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారులపై నుంచి డంపర్ లారీ వెళ్లడంతో ఐదుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన నయాగఢ్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లాలోని చరణ్ కుల్ ప్రాంతానికి చెందిన చిన్నారులు రోడ్డు పక్కన ఆడుకుంటున్నారు. ఇంతలో అటుగా వచ్చిన డంపర్ చిన్నారులపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు చిన్నారులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.