ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్: సూసైడ్ చేసుకున్న ఐదుగురు విద్యార్థులు

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు, ఫెయిల్ కావడాన్ని తట్టుకోలేక ఐదుగురు ఇంటర్ స్టూడెంట్స్ శుక్రవారం సూసైడ్ చేసుకున్నారు. వీరందరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో ఈ ఘటనలు...

ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్: సూసైడ్ చేసుకున్న ఐదుగురు విద్యార్థులు
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2020 | 11:33 AM

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తక్కువ మార్కులు, ఫెయిల్ కావడాన్ని తట్టుకోలేక ఐదుగురు ఇంటర్ స్టూడెంట్స్ శుక్రవారం సూసైడ్ చేసుకున్నారు. వీరందరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే. నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వికారాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా గురువారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అప్పటికే ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడొద్దు, టెన్షన్‌కి గురికావద్దని సైకాలజిస్టుల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన సుధాకర్, రాజేశ్వరి కుమార్తె సోని(16) స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గురువారం వెలువడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్‌లో 314 మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది

అలాగే మహబూబాద్ జిల్లా గుడూరులోని చెంద్రుగూడెంకు చెందిన సోలం జంపయ్య, నాగమణి దంపతుల కుమార్తె సోలం సరయు(16) మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన కారణంగా శుక్రవారం బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. ఇక వికారాబాద్‌ కుల్కచర్ల మండల పరిధిలోని భజ్యానాయక్ తండాకు చెందిన నిఖిత(18), సిద్ధిపేట గజ్వేల్‌లోని క్యాసారం గ్రామానికి చెందిన శ్రావాణి (17) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే గజ్వేల్ పట్టణానికి చెందిన బద్రీనాథ్(17) కూడా ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాడు. ఇది తట్టుకోలేక శుక్రవారం రాత్రి ఉరేసుకుని సూసైడ్ చేసున్నాడు.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు