అయిదు నగరాల్లోనే సగానికిపైగా కేసులు.. అసలేం జరుగుతోంది?

లాక్ డౌన్ ఎత్తివేతలో మొదటి దశ జూన్ 8వ తేదీన మొదలైంది మొదలు.. దేశంలో కరోనా కథాకళీ ఆడుతోంది. ప్రస్తుతం (జూన్ 13వ తేదీ సాయంత్రానికి) దేశంలో 3,08,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరగనున్నట్లు ..

అయిదు నగరాల్లోనే సగానికిపైగా కేసులు.. అసలేం జరుగుతోంది?
Follow us

|

Updated on: Jun 13, 2020 | 5:56 PM

లాక్ డౌన్ ఎత్తివేతలో మొదటి దశ జూన్ 8వ తేదీన మొదలైంది మొదలు.. దేశంలో కరోనా కథాకళీ ఆడుతోంది. ప్రస్తుతం (జూన్ 13వ తేదీ సాయంత్రానికి) దేశంలో 3,08,993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరగనున్నట్లు అంఛనాలు వినిపిస్తున్నాయి. జులై నెలాఖరు దాకా కరోనా కేసులు శరవేగంగా పెరుగుతాయని అంటున్నారు.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో మార్కెట్లోకి వచ్చే సంకేతాలు కనిపించడం లేదు. పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయంటూ పలు మీడియా సంస్థలు, వెబ్ సైట్లు రాస్తున్నాయి. జర్నల్స్ ప్రచురితం అవుతున్నాయి. కానీ ఏదీ వెనువెంటనే పలితమిచ్చేలా లేకపోవడంతో ప్రస్తుతం పెరిగిపోతున్న కరోనా కేసులను చూస్తూ అందరూ వర్రీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

దేశంలో మొదటి కరోనా కేసు నుంచి లక్ష సంఖ్యను చేరుకునేందుకు 109 రోజులు పట్టగా.. ఆ తర్వాత శరవేగంగా రెండు లక్షలకు.. ప్రస్తుతం మరింత వేగంగా మూడు లక్షలకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. అయితే విశాలమైన మన దేశంలో కేవలం 5 నగరాలలోనే సగానికి పైగా అంటే మూడు లక్షల్లో సుమారు లక్షా 55 వేల కేసులు నమోదయ్యాయంటే కరోనా విస్తరణకు జనసాంద్రతే ప్రధాన కారణమని, జనసాంద్రత అధికంగా వున్న నగరాలలో భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కరోనా కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందని అంఛనా వేస్తున్నారు.

శనివారం సాయంత్రానికి ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 56 వేలకు చేరువలో వుంది. ముంబయి మహానగరంలో భాగమైన థానేలో నమోదైన 16 వేల కరోనా కేసులను కూడా కలుపుకుంటే ముంబయి మహానగర పరిధిలో మొత్తం కేసుల సంఖ్య 72 వేలుగా చెప్పుకోవచ్చు. అటు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు 37 వేలకు చేరువలో వున్నాయి. దక్షిణాదిన ముఖ్య మహానగరం చెన్నైలో పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేలు దాటింది. అహ్మదాబాద్ నగరంలో 16 వేలు, ఫుణెలో 11వేల కేసులు నమోదయ్యాయి. ఈ అయిదు నగరాలను కలుపుకుంటూ మొత్తం కేసుల్లో సగానికి పైగా కనిపిస్తున్నాయి.

వీటిలో ముంబయి, చెన్నై, అహ్మదాబాద్, ఫుణె నగరాల నుంచి తెలుగు రాష్ట్రాలకు వలస కూలీలు పెద్ద సంఖ్యలో పలు మార్గాల ద్వారా చేరుకోవడమే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణమైంది అన్న అంఛనాలు వినిపిస్తున్నాయి. దాంతో జనసాంద్రత అధికంగా వుండే ప్రాంతాల్లో కరోనా ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా పాటించేలా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే ప్రస్తుతం ప్రభుత్వాల మీద, స్వచ్ఛంద సంస్థల మీద వున్న బాధ్యత అని విశ్లేైషకులు అభిప్రాయపడుతున్నారు.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..