నీరు లేక చేపలు విలవిల…

కరోనా కష్టాలు ఓ వైపు వెంటాడుతుంటే… మరోవైపు నీటి కష్టాలు రాజస్థాన్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా.. అక్కడ మాత్రం నీరు లేక చెరువులు ఎండిపోయాయి. అందులో ఉండే చేపలు విలవిలలాడుతున్నాయి. ఈ ఘటన జోద్‌పూర్ జిల్లా సోయ్లా గ్రామంలో చోటు చేసుకుంది. చెరువుల్లో నీటి జాడ లేక పోవటంతో అందులో ఉండే చేపలు మృత్యువాత పడుతున్నాయి. ఈ పరిస్థితి గమనించిన గ్రామస్థులు తలో చేయి వేశారు. ఇంటికి రూ. 300 […]

నీరు లేక చేపలు విలవిల...
Follow us

|

Updated on: Jun 13, 2020 | 2:39 PM

కరోనా కష్టాలు ఓ వైపు వెంటాడుతుంటే… మరోవైపు నీటి కష్టాలు రాజస్థాన్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా.. అక్కడ మాత్రం నీరు లేక చెరువులు ఎండిపోయాయి. అందులో ఉండే చేపలు విలవిలలాడుతున్నాయి. ఈ ఘటన జోద్‌పూర్ జిల్లా సోయ్లా గ్రామంలో చోటు చేసుకుంది. చెరువుల్లో నీటి జాడ లేక పోవటంతో అందులో ఉండే చేపలు మృత్యువాత పడుతున్నాయి.

ఈ పరిస్థితి గమనించిన గ్రామస్థులు తలో చేయి వేశారు. ఇంటికి రూ. 300 చొప్పున జమ చేశారు. ఆ డబ్బుతో చెరువులోకి ట్యాంకర్‌ ద్వారా నీటిని తెప్పించారు. ఆ నీటిని చెరువులోకి వదలడంతో.. కొన్నాళ్లు చేపలు బతికే అవకాశం ఉంది. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో చేపల… ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు.