చేపల చెరువులో దొంగలు పడ్డారు.. ఎక్కడో తెలుసా…

చేపల చెరువు లూటీ మహబూబాబాద్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వలలు...

చేపల చెరువులో దొంగలు పడ్డారు.. ఎక్కడో తెలుసా...
Follow us

|

Updated on: Jul 02, 2020 | 7:11 AM

చేపల చెరువు లూటీ మహబూబాబాద్ జిల్లాలో వివాదాస్పదంగా మారింది. కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వలలు, చీరల సాయంతో చేపలను పట్టుకెళ్లారు. అయితే మత్స్యకారులు చేపలు పట్టడం పూర్తయిందనే దష్ప్రచారంతోనే జనం తమ చెరువును లూటీ చేసినట్లు మత్స్యకారులు ఆరోపించారు.

కురవిలోని పెద్ద చెరువులో మత్స్యకార్మికులు కొన్నేళ్లుగా చేపల పెంపకం సాగుతోంది. అయితే మత్స్యకారులు చేపలు పట్టడం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు వద్ద కాపలాగా ఉన్నవారిపై వందలాది మంది దాడి చేసి చెరువులోకి దిగి చేపలను పట్టుకున్నారని మత్స్యకారులు తెలిపారు. లక్షలు రూపాయలు విలువ చేసే చేపలు పట్టుకెళ్లారని,తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గంగపుత్రులు వేడుకున్నారు. లూటీకి పాల్పడ్డ వారిపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వారి వాహనాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.