జూన్ 8 నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ: బత్తిని హరనాథ్ గౌడ్

Fish Medicine, జూన్ 8 నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ: బత్తిని హరనాథ్ గౌడ్

జూన్ 8వ తేది సాయంత్రం నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని మృగశిర ట్రస్ట్ కార్యదర్శి బత్తిని హరనాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం తొమ్మిదో తేది సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ మందును పంపిణీ చేస్తామని.. అస్తమా ఉన్న వారు ఈ మందును స్వీకరించగలరని ఆయన పిలుపునిచ్చారు. ఎంతమంది వచ్చినా అందరికీ ఈ మందును ఇస్తామని.. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.

కాగా 1845 నుంచి ప్రతి ఏటా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తోంది బత్తిని మృగశిర ట్రస్ట్. ఈ మందు వలన ఆస్తమా ఉన్న వారు ఎంతోమంది ఉపశమనం పొందారు. అందువలనే ఈ మందుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *