ఫ్రీగా చేపలు.. లగెత్తండి..!

సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం చేపల చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు చేపల కోసం ఒక్కసారిగా ఈ చెరువుపై పడ్డారు. చేపల కోసం ఇలా దండుగా దండయాత్ర చేశారు. దొరికినవారికి దొరికినంత మహదేవా అన్నట్టు దొరికినకాడికి చేపలను పట్టుకెళ్లారు. మార్కెట్‌‌లో చేపల ధర చుక్కలనంటుతున్న టైమ్‌లో గణపవరం చెరువులో ఫ్రీగా చేపలు తీసుకెళ్లొచ్చన్న ప్రచారం ఈ దుమారానికి దారి తీసింది.

గణపవరం చెరువు రెండు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. స్థానిక మత్స్యకారులు ప్రభుత్వం ఇచ్చిన సబ్సీడీ, సహకారంతో చెరువులో చేపల పెంపకాన్ని ప్రారంభించారు. గత శనివారం రాత్రి నుంచి చేపలు పట్టడం షురూ చేశారు. అయితే ఈ చెరువులో చేపలు ఫ్రీ.. అని ఎవరో వదంతులు రేపారు. అంతే.. గణపవరం గ్రామం సహా చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా తరలివచ్చి.. దొరుకునా ఇటువంటి ఛాన్స్ అంటూ చెరువులోని చేపలను పట్టుకెళ్లారు. స్థానిక మత్స్యకారులు అడ్డుకున్నా.. ఫలితం లేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *