అడిలైడ్‌ నగరంలో పెరుగుతోన్న కరోనా, ఆసీస్‌-ఇండియా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా?

ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగే మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. కారణం కరోనా వైరస్సే! ఇప్పటికే ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌తో పాటు కొందరు టెస్ట్‌ ప్లేయర్లు సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లారు.

అడిలైడ్‌ నగరంలో పెరుగుతోన్న కరోనా, ఆసీస్‌-ఇండియా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా?
Follow us

|

Updated on: Nov 16, 2020 | 1:00 PM

ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగే మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. కారణం కరోనా వైరస్సే! ఇప్పటికే ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌తో పాటు కొందరు టెస్ట్‌ ప్లేయర్లు సెల్ఫ్‌ ఐసోలేషన్‌కు వెళ్లారు.. అలాగని వారికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాలేదు.. కాకపోతే సౌత్‌ ఆస్ట్రేలియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ముందు జాగ్రత్తగా వారు ఆ నిర్ణయం తీసుకున్నారు.. మొన్నామధ్య సౌత్‌ ఆస్ట్రేలియాలో జరిగిన షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో టిమ్‌ పైన్‌, మాథ్యూ హెడ్‌లు పాల్గొన్నారు.. ఈ టోర్నీలో ఆడిన టాస్మానియా టైగర్స్‌ టీమ్‌లో మరికొంతమంది టెస్ట్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.. టోర్నమెంట్‌ ముగిసిన తర్వాత అందరూ టాస్మానియాకు తిరిగివచ్చారు. అయితే ఆటగాళ్లంతా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సిందేనని అధికారులు చెప్పడంతో వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.. ఇప్పుడు వారికి కరోనా పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. సౌత్‌ ఆస్ట్రేలియాలోనే ఉన్న అడిలైడ్‌ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది.. ఇక్కడే ఆసీస్‌-ఇండియా మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 17 నుంచి జరగనుంది.. కరోనా కారణంగా టెస్ట్‌ మ్యాచ్‌కు అడ్డంకులు ఏర్పడతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అదే సమయంలో షెడ్యూల్‌ ప్రకారమే టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుందని క్రికెట్‌ ఆస్ట్రేలియా అంటోంది.. పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, కొద్ది రోజుల్లోనే అన్ని నియంత్రణలోకి వస్తాయని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. టీమిండియా సభ్యలు ఆల్‌రెడీ సిడ్నీలో ప్రాక్టీస్‌ మొదలు పెట్టారు.. 14 రోజుల పాటు కరోనా నిబంధనలను పాటిస్తున్నారు ఆటగాళ్లు..