జనగణనలో తొలి అడుగు.. ఆస్తులు, వాహనాల లెక్కలకు రంగం రెడీ

2021లో ప్రారంభం కానున్న జనాభా గణన దిశగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పాపులేషన్ గణనకు సంబంధించి మార్చిన నిబంధనలపై ఒక పక్క ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదలవడం విశేషం. 2021 జనగణన కార్యక్రమంలో భాగంగా గృహాల వివరాలను కూడా మదింపు చేయాలని అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2021 నుంచి చేపట్టే జనగణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 తేదీ నుంచి సెప్టెంబర్ 30 […]

  • Rajesh Sharma
  • Publish Date - 4:14 pm, Thu, 30 January 20

2021లో ప్రారంభం కానున్న జనాభా గణన దిశగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. పాపులేషన్ గణనకు సంబంధించి మార్చిన నిబంధనలపై ఒక పక్క ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదలవడం విశేషం.

2021 జనగణన కార్యక్రమంలో భాగంగా గృహాల వివరాలను కూడా మదింపు చేయాలని అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2021 నుంచి చేపట్టే జనగణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు దీనికి సంబంధించిన వివరాలను గుర్తించాలని రాష్ట్రాల సెన్సెస్ అధికారులకు సూచనలు చేసింది కేంద్ర హోం శాఖ.

జనగణనలో భాగంగా గృహాలకు సంబంధించి 31 అంశాలను నమోదు చేయాలని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. ప్రతి ఇంటి నుంచి వివరాలను సేకరించి నమోదు చేయాలని జనగణన విభాగం స్పష్టం చేసింది. మొదటి ఐదు ప్రశ్నలు ఇంటికి సంబంధించిన వివరాలతో పాటు మరో రెండు ప్రశ్నలు గృహస్తుకు సంబంధించి వివరాలను సేకరిస్తూ ప్రశ్నావళి రూపొందించారు. అలాగే 20 ప్రశ్నలు ఇంటిలోని వివిధ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రశ్నలుగా పేర్కొన్నారు. మరో ఆరు ప్రశ్నలు వ్యక్తిగత ఆస్తులు, వాహనాలకు సంబంధించిన అంశాలపై వివరాలను నమోదు చేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.