‘ఇస్మార్ట్ శంకర్’ నుంచి రాబోతున్న మాస్ సింగిల్

iSmart Shankar, ‘ఇస్మార్ట్ శంకర్’ నుంచి రాబోతున్న మాస్ సింగిల్

డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించనుంది చిత్ర యూనిట్. అందులో భాగంగా మొదటగా ఓ మాస్‌ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దిమ్మాక్ ఖరాబ్ అంటూ సాగే పాటను ఈ రోజు 5గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ను చూస్తుంటే సాంగ్ ఓ రేంజ్‌లో ఉండబోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నబా నటేష్ నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. పరాజయాలతో కాస్త డీలా పడ్డ రామ్‌కు, పూరీ జగన్నాథ్‌ ఇద్దరికీ ఈ చిత్రంపై చాలా ఆశలే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *