‘చంద్రయాన్ 2’ తీసిన చందమామ ఫస్ట్ ఫొటో చూస్తారా?

చంద్రుడిపైకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ పంపిన చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుడి మొదటి ఫొటోను పంపింది. దీన్ని ఇస్రో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. చంద్రుడి కక్ష్యలో సుమారు 2650 కిలోమీటర్ల దూరం నుంచి చందమామను ఫొటో తీసి పంపింది. ఆగస్ట్ 21వ తేదీన చంద్రయాన్ 2 ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్టు పేర్కొంది. ఇటీవలే ఇస్రో తన చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో చంద్రుడి మీద విక్రమ […]

'చంద్రయాన్ 2' తీసిన చందమామ ఫస్ట్ ఫొటో చూస్తారా?
Final lunar orbit reducing maneuver of Chandrayann-2
Follow us

|

Updated on: Aug 22, 2019 | 8:35 PM

చంద్రుడిపైకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారత్ పంపిన చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రుడి మొదటి ఫొటోను పంపింది. దీన్ని ఇస్రో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. చంద్రుడి కక్ష్యలో సుమారు 2650 కిలోమీటర్ల దూరం నుంచి చందమామను ఫొటో తీసి పంపింది. ఆగస్ట్ 21వ తేదీన చంద్రయాన్ 2 ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్టు పేర్కొంది. ఇటీవలే ఇస్రో తన చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. వచ్చే నెలలో చంద్రుడి మీద విక్రమ లాండర్‌ను దింపనుంది. అత్యంత క్లిష్టమైన ఈ దశను విజయవంతంగా పూర్తి చేస్తే అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇస్రో కొత్త చరిత్రను సృష్టించినట్టే.