తొలిసారిగా చంద్రుడి కలర్ ఫొటో..!

సాధారణంగా భూమి నుంచి మనం చూస్తే.. చంద్రుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి పచ్చగా, మరోసారి తెల్లగానూ, ఎర్రని ఛాయల్లోనూ, ఒక్కోసారి బూడిద రంగులోనూ మనకి కనిపిస్తూ ఉంటాడు. దీంతో చంద్రుడి ఉపరితలాన్ని బట్టి రంగులద్దుతూ..

తొలిసారిగా చంద్రుడి కలర్ ఫొటో..!
Follow us

| Edited By:

Updated on: May 04, 2020 | 8:25 PM

సాధారణంగా భూమి నుంచి మనం చూస్తే.. చంద్రుడు ఒక్కోసారి ఒక్కో విధంగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒకసారి పచ్చగా, మరోసారి తెల్లగానూ, ఎర్రని ఛాయల్లోనూ, ఒక్కోసారి బూడిద రంగులోనూ మనకి కనిపిస్తూ ఉంటాడు. దీంతో చంద్రుడి ఉపరితలాన్ని బట్టి రంగులద్దుతూ.. కొన్ని మ్యాపులు ఇప్పటికే చలామణిలో ఉన్నా వాటికి సరైన ప్రామాణికత లేదు. ఈ కొరత తీర్చడానికి శాస్త్రవేత్తలు తొలిసారిగా చంద్రుడి నైసర్గిక ప్రాంతాలకు వివిధ రంగులు జతచేసి ఓ మ్యాప్ రూపొందించారు. అమెరికా జియాలాజికల్ సర్వే ఈ కలర్ కోడెడ్ మ్యాప్‌ను తయారు చేసింది. జియోగ్రాఫికల్ మ్యాపుల్లో భూమి, రాతి పొరలను బట్టి, అక్కడి ధాతువులను బట్టి ఆయా ప్రాంతాలకు రంగులు కేటాయించారు. గతంలో చంద్రుడికి సంబంధించి సేకరించిన డేటా ఆధారంగా.. ముఖ్యంగా నానా డేటా, లూనార్ ప్లానెటరీ ఇన్‌స్టిట్యూట్ లోటపాట్లను సరిదిద్దడంతో పాటు పరిశోధకులకు ఉపయోగపడేలా దీన్ని తయారు చేసినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు.

Read More:

షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!