Coronavirus: ఏపీలో తొలి కరోనా కేసు..

ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అతడి రిపోర్ట్స్ పాజిటివ్‌గా వచ్చింది. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు

Coronavirus: ఏపీలో తొలి కరోనా కేసు..
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 8:10 PM

ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అతడి రిపోర్ట్స్ పాజిటివ్‌గా వచ్చింది. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు వైద్యాధికారులు.

నగరంలోని చిన్న బజారుకు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చారు. అతడు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఆస్పత్రిలో చేర్పించారు. సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వైరస్ లక్షణాలు కనిపించడంతో కరోనా భాదితుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  పాజిటివ్ కేసు నమోదు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఇది విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నాం. మరిన్ని ఐసోలేషన్ వార్డులను ఏర్పాటుచేస్తున్నాం. విదేశాల నుంచి వచ్చే వారి వివరాలు పూర్తిగా సేకరిస్తున్నాం. మొత్తం 14 మందికి పరీక్షలు నిర్వహించాం. ఇందులో ఏడుగురికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేస్తున్నాం. నెల్లూరుకు వచ్చిన విదేశీయులకు పరీక్షలు చేస్తున్నాం. ప్రజలకు అవసరమైన మూస్కులు తెప్పిస్తున్నామని ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కలెక్టర్ ఎం.వి.శేషగిరి బాబు వివరించారు.