ట్వీట్‌తో రైల్వే కార్గో సేవలు

రైల్వే అధికారులకు ఒక ట్వీట్ చేస్తే చాలు మీ ముంగిట వారి సేవలు ప్రత్యక్షమవుతాయి. ఇందు కోసం దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే కార్గో..

ట్వీట్‌తో రైల్వే కార్గో సేవలు
Follow us

|

Updated on: Jul 24, 2020 | 6:49 AM

First Cargo Express : రైల్వే అధికారులకు ఒక ట్వీట్ చేస్తే చాలు మీ ముంగిట వారి సేవలు ప్రత్యక్షమవుతాయి. ఇందు కోసం దేశంలోనే తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే కార్గో ఎక్స్‌ప్రెస్‌ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఆగస్టు 5 నుంచి తొలి సర్వీసును ప్రారంభించనున్నారు.

ముందుగా హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వరకు పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద కార్గో ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని నిర్ణయించింది. చిన్న, మధ్య తరహా వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా.. నాన్‌ బల్క్‌ లో సరుకులు చేర్చాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

దీంతో వ్యవసాయ ఉత్పత్తులు.. చిన్న పరిశ్రమదారులు తమ సరుకును కార్గో ఎక్స్‌ప్రెస్‌ ద్వారా ఆయా ప్రాంతాలకు చేర్చే అవకాశం లభిస్తుంది. రోడ్డు రవాణాతో పోలిస్తే ప్రస్తుత రైల్వే టారిఫ్‌ 40 శాతం చార్జీలు తక్కువ ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రవాణా చార్జీలు టన్నుకు సగటున రూ.2,500 వరకు తీసుకుంటోంది.