‘కూలి నెం.1’ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..

‘Coolie No. 1’ suffers huge loss due to fire on the sets, ‘కూలి నెం.1’ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం..

బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ముంబయిలోని ఫిల్మీస్థాన్‌ స్టూడియోలో ఓ భారీ సెట్‌ను వేశారు. సెప్టెంబర్‌ 11వ తేదిన ఈ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదం తర్వాత ఆ చిత్ర నిర్మాత సోషల్‌మీడియా వేదికగా ‘సెట్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బందికి, ముంబయి పోలీసులకు ధన్యవాదాలు. ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.’ అని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం సెట్‌లో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం వల్ల చిత్రబృందానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకూ నష్టం వాటిల్లిందని బాలీవుడ్‌లో వినికిడి. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సెట్‌కి ఇన్సూరెన్స్ చేయించడంతో క్లైయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

వరుణ్‌ధావన్‌, సారా అలీఖాన్‌ నటిస్తున్న ‘కూలీ నం1’ చిత్రానికి డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్‌ చేస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కారణంగా కొన్ని రోజుల పాటు ఈ షూటింగ్‌ను వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *