Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పొగతో ఉక్కిరిబిక్కిరైన జనం

దీపావళి పండుగ రోజు మహానగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని ఓ టైర్ రిట్రేడింగ్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న టైర్లకు ఆ నిప్పంటుకుని తగలబడ్డాయి. విషయం తెలుసుకున్న గోదాం యజమానులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు.. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. టైర్ల నుంచి పొగలు వెలువడుతుండటంతో.. స్థానికులు శ్వాస తీసుకోడానికి తీవ్ర ఇబ్బుందులు పడ్డారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై గోదాం నిర్వాహకులను, స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు. దీపావళి కావడంతో బాణాసంచా ఎగిరిపడటంతో ఈ ప్రమాదం జరిగిందా.. లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా..? లేదా మరేదైనా కారణమై ఉండొచ్చా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.