ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వాల్మికీ బస్తీలో (03జూన్) బుధవారం ఉదయం చిన్నగా మొదలైన మంటలు బస్తీ మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అప్రమత్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న 20 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. బుధవారం తెల్లవారుజామున 1:31 గంటలకు మొదలైన మంటలు.. మూడు గంటల వరకు కొనసాగాయి. మంటలను ఆర్పేందుకు సుమారు 3 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అయితే అప్పటికే బస్తీ మొత్తం వ్యాపించటంతో పెద్ద ఎత్తున ఆస్తి […]

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
Follow us

|

Updated on: Jun 03, 2020 | 8:12 AM

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వాల్మికీ బస్తీలో (03జూన్) బుధవారం ఉదయం చిన్నగా మొదలైన మంటలు బస్తీ మొత్తం వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అప్రమత్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న 20 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాయి. బుధవారం తెల్లవారుజామున 1:31 గంటలకు మొదలైన మంటలు.. మూడు గంటల వరకు కొనసాగాయి. మంటలను ఆర్పేందుకు సుమారు 3 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. అయితే అప్పటికే బస్తీ మొత్తం వ్యాపించటంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని స్థానిక డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ఎస్‌కే దువా తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇప్పటికే కరోనా వ్యాప్తితో భయందోళనలో ఉన్న ఢిల్లీ వాసులను ఇలాంటి ప్రమాదాలు మరింత వణికిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పియిన వాల్మికీ బస్తీ వాసులు ఇప్పుడు నిలువ నీడ కూడా లేకుండా పోయింది.