బెల్జియం ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌లో అగ్నిప్రమాదం.. విమాన సర్వీసులు రద్దు..

యూరప్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మమైన బెల్జియం లీజ్ ఎయిర్ పోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.స్థానిక కాలమాన ప్రకారం.. బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో.. ఎయిర్ పోర్టు టర్మినల్ సమీపంలో ప్రమాదం..

బెల్జియం ఎయిర్‌పోర్ట్ టర్మినల్‌లో అగ్నిప్రమాదం.. విమాన సర్వీసులు రద్దు..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 1:01 PM

యూరప్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మమైన బెల్జియం లీజ్ ఎయిర్ పోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.స్థానిక కాలమాన ప్రకారం.. బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో.. ఎయిర్ పోర్టు టర్మినల్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో విమానాల రాకపోకలకు బ్రేకులు వేశారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి విమానశ్రయంలోని చెలరేగుతున్న మంటలను దాదాపు గంట పాటు తీవ్రంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ ఎయిర్ పోర్టు నుంచే సరుకుల రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. దాదాపు యూరప్ దేశాలన్నింటికి ప్రస్తుతం అన్ని రకాల ఔషధాలను ఇక్కడి నుంచే పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో.. తాత్కాలికంగా సర్వీసులను రద్దు చేశారు. దీంతో ఔషధాల సరఫరాకు అంతరాయం కలిగింది.