ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు..

Fire breaks out in forests of Uttarakhand, ఉత్తరాఖండ్‌ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు..

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లా అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అంటుకుంది. దీంతో వందల హెక్టార్లలో అటవీ సంపద అగ్నికి ఆహుతవుతోంది. పెద్ద పెద్ద వృక్షాలన్నీ మంటల్లో కాలిపోతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతూ… ఇతర ప్రాంతాలకు వ్యాప్తిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. అయితే గాలులు వీస్తుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలుపుతున్నారు.

కాగా, ఉత్తరాఖండ్‌లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే మంగళవారం సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల పాటు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని.. అధిక ఉష్ణోగ్రతల కారణంగానే మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *