వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

Fire breaks out in a cloth factory at Pandesara in Surat, వస్త్ర పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ వస్త్ర పరిశ్రమలో శనివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలు దట్టమైన పొగల్ని అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా అన్న దానిపై ఇంకా ఎలాంటి సమాచారం తెలియరాలేదు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *