కోల్‌కతా హౌరా బ్రిడ్జ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Fire Breaks Out At Chemical Godown Near Kolkata's Howrah Bridge, కోల్‌కతా హౌరా బ్రిడ్జ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జికి సమీపంలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాథ్ ఘాట్ వద్ద ఉన్న ఓ కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 25 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తోంది. భారీగా మంటలు వ్యాపించడంతో.. అదుపు చేయడానికి సమయం పడుతుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గోడౌన్‌లోని మధ్య భాగం పూర్తిగా కాలిపోయిందని.. దీంతో లోపలికి వెళ్లేందుకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. అయితే భారీగా ఆస్తి నష్టం సంభవించిందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *