ఆరుగాలం కష్టం అగ్గిపాలు..!
నిర్మల్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్నటువంటి పంటలకు వ్యాపిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి వచ్చేలోపే పంట మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో సుమారు లక్షన్నరకుపైగా ఆస్తినష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేశారు. భైంసా మండలంలోని దేగాంకు చెందిన వెంకట్రెడ్డి పొలంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు తగలటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని […]
నిర్మల్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. పక్కనే ఉన్నటువంటి పంటలకు వ్యాపిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి వచ్చేలోపే పంట మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో సుమారు లక్షన్నరకుపైగా ఆస్తినష్టం జరిగినట్లుగా అధికారులు అంచనా వేశారు. భైంసా మండలంలోని దేగాంకు చెందిన వెంకట్రెడ్డి పొలంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు తగలటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.