Breaking News
  • రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు తప్పనిసరిగా మూసివేయాలన్న కేంద్రం. సరుకు రవాణా మినహా ఎలాంటి రవాణాకు అనుమతి నిరాకరణ. కలెక్టర్లు, ఎస్పీలే బాధ్యత వహించాలన్న కేంద్రం. వలస కూలీలకు 14 రోజుల క్వారంటైన్‌. అద్దె డిమాండ్‌ చేసే ఇంటి యజమానులపై కఠిన చర్యలు. లాక్‌డౌన్‌ను మరింత కఠినం చేయాలని కేంద్రం ఆదేశాలు.
  • ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు. 7,21,412కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. ఇప్పటివరకు కోలుకున్న 1,51,004 మంది. ప్రపంచ వ్యాప్తంగా 33,956 మంది మృతి. స్పెయిన్‌లో నిన్న ఒక్కరోజే 838 మంది మృతి. నిన్న ఇటలీలో 756 మంది, ఫ్రాన్స్‌లో 292 మంది మృతి. నిన్న అమెరికాలో 237 మంది, బ్రిటన్‌లో 209 మంది మృతి. నిన్న ఒక్కరోజే అమెరికాలో కొత్తగా 17,600 కేసులు నమోదు. అమెరికాలో 1,41,812 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఇటలీలో లక్షకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య. చైనా-3,300, ఇరాన్‌-2,640, ఫ్రాన్స్‌-2,606 మంది మృతి. అమెరికా-2,475, ఇంగ్లాండ్‌-1,228 మంది మృతి.
  • కరోనాపై పోరుకు ఏపీ ఐఏఎస్‌ అధికారుల ఆర్థిక చేయూత. మూడు రోజుల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇవ్వాలని.. ఐఏఎస్‌ అధికారుల సంఘం నిర్ణయం.
  • ఛత్తీస్‌గఢ్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పాండేపై కేసు నమోదు. బిలాస్‌పూర్‌లో 144 సెక్షన్‌ ఉల్లంఘించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు.
  • ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ అధికారుల సస్పెన్షన్‌. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన కేంద్రహోంశాఖ. కరోనా నివారణపై నిర్లక్ష్యం వహించినందుకు కేంద్రం చర్యలు.

Fire Accident : భార్యను కాపాడి..తాను మృత్యు ఒడిలోకి..

Fire Accident : Indian man dies of burn injuries after saving wife from fire in UAE, Fire Accident : భార్యను కాపాడి..తాను మృత్యు ఒడిలోకి..

Fire Accident :  మంటల్లో చిక్కుకుపోయిన తన అర్ధాంగిని కాపాడిన ఓ వ్యక్తి..తాను మాత్రం మృత్యువును జయించలేకపోయాడు. వివరాల్లోకి వెళ్తే..కేరళకు చెందిన అనిల్.. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి అబుదాబీలో నివశిస్తున్నాడు. వారు నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లో గత వారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారిడార్‌లో పని చేసుకుంటున్న అనిల్ భార్య నీనూ మంటల్లో చిక్కుపోయింది. ఆమె అరుపులు విన్న అనిల్..భార్యను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు ఆమెకు బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరికి మంటలు అంటుకున్నాయి.

వెంటనే వారిని లోకల్ హాస్పటల్‌కి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువ ఉండటంతో..అక్కడి నుంచి అబుదాబీలోని మరో ఆస్పత్రికి షిప్ట్ చేశారు. అయితే అనిల్‌ 90 శాతం కాలిన గాయాలతో..మృత్యువును ఎదిరించలేక సోమవారం (ఫిబ్రవరి 17) తుదిశ్వాస విడిచారు. 10 శాతం గాయాలైన అతడి భార్య నీనూ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కాగా అనిల్ చనిపోయిన విషయం నినూకి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

Related Tags