హైదరాబాద్ బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కర్మాగారంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగతో ఉవ్వెత్తున్నఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ హహకారాలు చేశారు.

హైదరాబాద్ బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం
Follow us

|

Updated on: May 28, 2020 | 5:28 PM

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కర్మాగారంలో ప్రమాదవశాత్తు మంటలు ఎగసిపడ్డాయి. ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై అధికారులు, పోలీసులు ఆరా చేపట్టారు.

నగరంలోని బాలానగర్ ఇండస్ట్రీయల్ ఏరియా గాంధీ నగర్‌లోని యాష్ అనే ఫ్యాన్ల తయారీ కంపెనీలో గురువారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ హహకారాలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన యాజమాన్యం పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పట్టపగలే సంభవించిన ప్రమాదంతో ప్రాణనష్టం తప్పినప్పటికీ, అక్కడున్న వారంతా భయంతో హడలెత్తిపోయారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు, ఫైర్ సిబ్బంది నిర్ధారించారు. కాగా, ప్రమాదంలో భారీగా యంత్ర సామాగ్రి మంటల్లో కాలిబూడిదై పోవటంతో, జరిగిన ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.